Allu Aravind: ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ చూసి అల్లు అరవింద్ ఏమన్నారంటే?

సుహాస్ హీరోగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ .. వంటివి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘జి ఎ 2 పిక్చర్స్’ ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్’ ‘మహాయాన మోషన్ పిక్చర్స్’ సంస్థల పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ‘బన్నీ వాస్’ ‘వెంకటేష్ మహా’ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.

ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే.. ఆ సినిమా రషెస్ ను నిర్మాత అల్లు అరవింద్ చూసి మార్పులు చెప్పడం, అవి జరిగిన తర్వాతే ప్రోడక్ట్ ను బయటకు వదలడం అనేది ఆనవాయితీ అని ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే మాట. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా విషయంలో కూడా అల్లు అరవింద్ డెసిషనే ఫైనల్ అయ్యింది. కాకపోతే ఈసారి జరిగింది వేరు.

అల్లు అరవింద్ (Allu Aravind) గారు 2 సార్లు ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ చిత్రాన్ని చూడటం జరిగిందట. కానీ ఎటువంటి మార్పులు చెప్పకుండా.. ‘సినిమా బాగా వచ్చింది’ అని టీంని అభినందించారట.ఈ విషయాన్ని నిర్మాత ధీరజ్ మొగిలినేని మీడియాతో చెప్పుకొచ్చారు. ఈ సినిమా పై అరవింద్ గారికి మంచి కాన్ఫిడెన్స్ ఉందని కూడా ధీరజ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ‘అల్లు అరవింద్ అంత కాన్ఫిడెంట్ గా ఉంటే .. నిజంగా సినిమా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని మీడియా వర్గాలు భావిస్తున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus