Allu Aravind: ఫిలింఫేర్ అవార్డులలో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న సెలబ్రిటీల వీళ్ళే?

Advertisement

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు ఫిలింఫేర్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ క్రమంలోని ప్రతి ఏడాది ఫిలింఫేర్ అవార్డులను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణం వల్ల ఈ అవార్డు వేడుకలను నిర్వహించలేదు. అవార్డులను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఆదివారం బెంగళూరులో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున దక్షిణాది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.ఇకపోతే ఈ అవార్డుల వేడుకలలో భాగంగా ఎక్కువగా పుష్ప సినిమాకు ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.అదేవిధంగా ఈ వేడుకలలో భాగంగా ఫిలిం ఫెర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందించారు.

ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అందుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా ప్రముఖ కన్నడ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ కి కూడా జీవిత సాఫల్య పురస్కారం అందించారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు సందడి చేశారు.

ఇక ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పుష్ప సినిమా పెద్ద ఎత్తున అవార్డులను అందుకోగా.. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి సూర్య నటించిన సురారై పొట్రు సినిమాకు కూడా పెద్ద ఎత్తున అవార్డులు వచ్చాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus