Allu Aravind: జూనియర్లకు కూడా అవకాశం ఇవ్వండి: అల్లు అరవింద్

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా అల్లు అరవింద్ అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన తన సొంత బ్యానర్ ద్వారా ఎంతోమంది డైరెక్టర్లను హీరోలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇలా గీత ఆర్ట్స్ ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు అరవింద్ ఇండస్ట్రీలో సీనియర్ సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్లు జూనియర్లను తొక్కేయొద్దని వారికి కూడా ఇండస్ట్రీలో కాస్త స్పేస్ ఇవ్వాలని ఈయన కోరారు.దర్శకులైన హీరో హీరోయిన్స్ అయినా కూడా కొత్తవారికి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు.

తాను డైరెక్టర్ చందు మొండేటి కన్నా ముందుగా మరొక డైరెక్టర్ కి తన బ్యానర్ లో అవకాశం కల్పించాలని తెలిపారు. అయితే తన పేరును ఇప్పుడు తాను ప్రస్తావించదల్చుకోలేదని అల్లు అరవింద్ తెలిపారు. తన బ్యానర్లో ఆ డైరెక్టర్ కి అవకాశం కల్పించిన ఆయన మాత్రం గీత ఆర్ట్స్ నుంచి నుంచి బయటకు వెళ్లాడని అన్నారు.

ఆ డైరెక్టర్ కి అసలు అవకాశం ఇచ్చింది తామేనన్న అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో గీత ఆర్ట్స్ నుంచి బయటకు వెళ్లిన ఆ డైరెక్టర్ ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు.ఏది ఏమైనా అల్లు అరవింద్ ఇండస్ట్రీ గురించి సెలబ్రిటీల గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus