ఎప్పటినుండో టాలీవుడ్ అగ్ర నిర్మాతగా కొనసుగుతోన్న అల్లు అరవింద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ఎన్నో చిత్రాలను తెరకెక్కించి అసాధారణ విజయాల్ని సొంతం చేసుకున్నారాయన. చిన్న సినిమాల కోసం ‘జి.ఏ2.పిక్చర్స్’ ను కూడా స్థాపించి.. చిన్న సినిమాలతో కూడా పెద్ద రేంజ్లో లాభాలు అందుకుంటూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన తనయుడు బన్నీ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘అలవైకుంఠపురంలో’ సినిమాకి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పుడు యువ హీరో నిఖిల్ తో కూడా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. జనవరి నుండీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ మెగా ప్రొడ్యూసర్ త్వరలోనే ‘ఓ టి టి’ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ రంగంలోకి అడుగుపెట్టి… తన మొదటి ప్రాజెక్ట్ గా ‘అర్జున్ సురవరం’ చిత్రం డిజిటల్ హక్కులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 2.5 కోట్లకు ‘అర్జున్ సురవరం’ డిజిటల్ రైట్స్ ను అల్లు అరవింద్ దక్కించుకున్నారట. ఇక భవిష్యత్తు అంతా.. ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ దే అని భావించి ఈ బడా నిర్మాత ఈ స్టెప్ తీసుకున్నట్టు స్పష్టం అవుతుంది.
అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!