బన్నీ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన కొరటాల శివ

అల్లు అర్జున్ తన 20వ చిత్రం దర్శకుడు సుకుమార్ తో చేస్తుండగా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. పుష్ప టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు. ఐతే ఇంత వరకు బన్నీ ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనలేదు. ఇక ఈ చిత్రంలో బన్నీ రాయలసీమకు చెందిన లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నాడు. బన్నీ పుట్టినరోజు కానుకగా చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కింది. కాగా బన్నీ తన 21వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో చేయనున్నారు.

ఇప్పటికే వీరిమధ్య దీనిపై ఓ అవగాహనా కుదిరిందని వినికిడి. ప్రస్తుతం ఆచార్య సినిమా కోసం పనిచేస్తున్న కొరటాల లాక్ డౌన్ కారణంగా కొద్దిరోజులుగా ఇంటిలోనే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో బన్నీ కోసం ఓ మాంచి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ఆయన సిద్ధం చేశారట. ఎప్పటిలాగే కొరటాల మార్కు సోషల్ సబ్జెక్టు కి కమర్షియల్ అంశాలు జోడించి ఈ స్క్రిప్ట్ డెవలప్ చేశారని తెలుస్తుంది. గతంలో వీరిద్దరూ అసలు కలిసి పని చేయలేదు.

ఇక బన్నీ లుక్ అండ్ మేనరిజం కూడా సరికొత్తగా కొరటాల చూపించే అవకాశం కలదని తెలుస్తుంది. వరుసగా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్న బన్నీ, కొరటాల మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయం అంటున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా కొరటాలతో మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అన్ని కుదిరితే ఈ చిత్రం 2021 చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి చూద్దాం ఓటమి తెలియని కొరటాల బన్నీ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారో.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus