Allu Arjun, Boyapati Srinu: బోయపాటితో సినిమా… ఇక నొ డిలే అంటున్న అల్లు అర్జున్ టీం..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాబోతుందని చాలా రోజుల నుండీ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బన్నీకి అత్యంత సన్నిహితుడు మరియు ‘జిఎ2 పిక్చర్స్’ అధినేత అయిన బన్నీవాస్ కూడా ఈ విషయం నిజమే అన్నట్టు ఓ సందర్భంలో సంకేతాలు ఇచ్చారు. అయితే ‘పుష్ప’ తర్వాత ‘పుష్ప2’ కూడా ఉండబోతుందని సుకుమార్ అండ్ టీం ఎప్పుడో ప్రకటించింది. ఆ లెక్కన చూసుకుంటే బోయపాటితో సినిమా అంటే చాలా టైం పడుతుందని కూడా అంతా అనుకున్నారు.

కానీ ‘పుష్ప2’ అప్పుడే షూటింగ్ అప్పుడే స్టార్ట్ అవ్వకపోవచ్చని కూడా బన్నీ వాస్ తెలిపాడు. కాబట్టి.. ఈ గ్యాప్ లో బోయపాటి శీనుతో బన్నీ సినిమా చేసే అవకాశం ఉందని కూడా టాక్ వినిపించింది. ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీరి సాన్నిహిత్యం చూస్తే బోయపాటితో సినిమా చేయడానికి బన్నీ… చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని స్పష్టమవుతుంది. అందులోనూ ‘అఖండ’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో బన్నీ.. బోయపాటితోనే సినిమా చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట.

గతంలో వీరి కాంబినేషన్లో ‘సరైనోడు’ సినిమా వచ్చింది. ఆ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.కాబట్టి ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొనే అవకాశం పుష్కలంగా ఉంది.త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బన్నీ సన్నిహితవర్గం నుండీ సమాచారం. ‘పుష్ప’ విడుదల తర్వాత ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ‘గీత ఆర్ట్స్’ ‘ద్వారకా క్రియేషన్స్’ సంస్థలు కలిసి ఈ భారీ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మళ్ళీ తమన్ నే సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవాలని బోయపాటి భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ‘అఖండ’ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాస్ కు పూనకాలు తెప్పించి.. చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus