ఆయనకు నాకు ఒక్క క్షణం పడదంటున్న అల్లు అర్జున్

రేపు బన్నీ- త్రివిక్రమ్ ల క్లాసికల్ ఎంటర్టైనర్ అల వైకుంఠపురంలో మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది. నేటి రాత్రి నుండే యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శన ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో పై అంచనాలు భారీగా ఉన్నాయి. థమన్ అందించిన సాంగ్స్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అలాగే మూవీ ట్రైలర్ కూడా ప్రేక్షకులను త్రివిక్రమ్ మార్క్ టేకింగ్ అండ్ డైలాగ్స్ తో కట్టిపడేసింది. బన్నీ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఈ చిత్రం కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా నిన్న చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు అల్లు అర్జున్. చిత్రం గురించి అనేక విషయాలు పంచుకున్న ఆయన అల వైకుంఠపురంలో తన పాత్ర గురించి కూడా చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుండి తన కోరికలను, ఆశలను నెరవేర్చుకోలేని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా బన్నీ పాత్ర ఉంటుందట. పూజ హెగ్డే బాస్ గా ఉన్న ఆఫీస్ లో ఓ ఉద్యోగిగా అల్లు అర్జున్ ఉంటారట. ఆసక్తికర విషయం ఏమిటంటే అల్లు అర్జున్ మరియు మురళి శర్మల మధ్య సన్నివేశాలు చాల సరదాగా ఆహ్లాదంగా ఉంటాయట. బన్నీ తండ్రి పాత్ర చేస్తున్న మురళి శర్మకు బన్నీకి అస్సలు పడదట. తన రెస్ట్రిక్షన్స్ తో ఎప్పుడూ బన్నీని విసిగించే తండ్రిగా మురళి శర్మ ఉంటాడట. వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ పోరు ఉంటుందని బన్నీ స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మించారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus