Allu Arjun: వయసు తక్కువ హీరోయిన్లతో హీరోల రొమాన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్ హీరోయిన్‌..!

(Allu Arjun) సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చేసే పోస్టుల కారణంగానూ ట్రోల్ అవుతుంటారు.. అది వారి వ్యక్తిగత అభిప్రాయమే కావొచ్చు కానీ నానార్థాలు తీస్తుంటారు నెటిజన్లు.. ఇక ఆ పోస్ట్ చేసింది హీరోయిన్ అయితే మాత్రం మామూలుగా ఆడుకోరు.. ఇప్పుడు అల్లు అర్జున్ ‘వరుడు’ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి.. వచ్చినంత వేగంగా కనిపించకుండా పోయిన భానుశ్రీ మెహ్రాను టార్గెట్ చేశారు.. ఆమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ విషయంలో తన ఒపినీయన్ చెప్పింది.. దానికే కార్నర్ చేసేశారు..

ఈమధ్య అల్లు అర్జున్ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడంటూ స్క్రీన్ షాట్ తీసి మరీ సోషల్ మీడియాలో హంగామా చేసింది భానుశ్రీ . ఆ వార్త బన్నీ వరకు వెళ్లడంతో మళ్లీ అన్ బ్లాక్ చేశాడు.. దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది.. ఇక రీసెంట్‌గా.. హీరోయిన్లకు ఫేవర్‌గా ఓ పోస్ట్ చేసింది.. ‘‘సినిమా ఇండస్ట్రీలో వయసు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది.. హీరోయిన్లకు వయసు పెరిగితే వారిని తల్లి, వదిన వంటి సైడ్ క్యారెక్టర్లకు పరిమితం చేసేస్తారు..

కానీ ఏజ్ ఎక్కువ ఉన్న హీరోలు మాత్రం వారిలో సగం వయసున్న హీరోయిన్లతో లవ్ సీన్లు చేస్తుంటారు.. పెళ్లి, వయసు పెరగడం వంటి కారణాలతో ఎందుకు ఆడవారి మీద పక్షపాతం?.. ఈ మూస ధోరణికి ఇకనైనా స్వస్తి చెప్పండి.. స్వతంత్రంగా జీవిస్తూ.. మనోధైర్యంతో ముందడుగు వేస్తున్న మహిళల కథలను చెప్పండి’’ అంటూ పోస్ట్ చేసింది.. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. ‘తాత వయసున్న హీరోలు 25 ఏళ్ల కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు..

నువ్వునుకున్నది జరగడం అంత ఈజీ కాదులే.. ఇంతకుముందుకన్నా ఇప్పుడే బాగున్నారు.. మాటలు ఆపి ముందు సినిమాలు చేయండి.. వయసుతో సంబంధం లేకుండా అనుష్క ఇప్పటికీ సినిమాలు చేస్తోంది.. కానీ నీకు లక్ కలిసి రాలేదు.. నువ్వు చూడడానికి తల్లిలాగే కనిపిస్తున్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus