కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా నాపేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో సోల్జర్ గా నటిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఊటీ, హైదరాబాద్ లలో రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్లో విలన్ అనూప్ ఠాకూర్ సింగ్ తో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేసిన అల్లు అర్జున్… వెంటనే అను ఇమ్మాన్యూల్ తో ఒక రొమాంటిక్ పాటను అందుకున్నారు. ఈ పాట రేపటితో కంప్లీట్ అవుతుందని చిత్ర బృందం వెల్లడించింది.
త్వరలోనే మరో షెడ్యూల్ మొదలుకానుంది. శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం విశాల్, శేఖర్ పాటలు కంపోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో బన్నీ క్యారెక్టర్ తో పాటు మ్యూజిక్ సరికొత్తగా ఉండనుంది. చాలా గ్యాప్ తర్వాత మెగా బ్రదర్ కె.నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.