Allu Arjun: ‘గామి’ సినిమాపై బన్నీ ప్రశంసలు!

‘గామి’ అనే సినిమాను మొదలుపెట్టి చాలా కాలమవుతోంది. దాదాపు నాలుగేళ్ల క్రితం దర్శకుడు కాగిత విద్యాధర్ ఈ సినిమాను మొదలుపెట్టారు. గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ లో సినిమా తీయాలనుకున్నారు. కానీ తీయలేకపోయారు. దీంతో క్రౌడ్ ఫండింగ్ కి వచ్చారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కి కాన్సెప్ట్ నచ్చడంతో క్రౌడ్ ఫండింగ్ కోసం మాట సాయం చేశారు. మొత్తానికి ఎన్నో కష్టాలు దాటుకొని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సినిమా చూసిన యూవీ క్రియేషన్స్ సంస్థ తన బ్యానర్ పై సినిమాను విడుదల చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. యూవీ రాకతో ‘గామి’ సినిమాపై హైప్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా సాగింది. దీనిపై అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”కొత్త కథలతో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తోన్న యూవీ క్రియేషన్స్‌కి నా హృదయపూర్వక అభినందనలు. ‘గామి’ గ్లిమ్స్ నాకెంతగానో నచ్చింది.

చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు. ఈ సినిమాలో చాలామంది నూతన నటీనటులే. పరిశ్రమలోకి కొత్తతరం దర్శకులు రావడం ఆనందంగా ఉంది” అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్, చాందిని చౌదరి లాంటి తారలు కనిపించనున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus