అల్లు అర్జున్ బ్లాక్ చేశాడు అంటూ స్క్రీన్ షాట్లు షేర్ చేసిన హీరోయిన్

అల్లు అర్జున్ టాలీవుడ్లో ఉన్న బడా స్టార్ హీరోల్లో ఒకరు. ఇతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకపరిచయం అవసరం లేదు. ‘అల వైకుంఠపురములో’ ‘పుష్ప’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ‘పుష్ప 2’ లో నటిస్తున్న ఈ ఐకాన్ స్టార్.. ఆ మూవీతో చరణ్ లానే గ్లోబల్ స్టార్ అవ్వాలని తాపత్రయపడుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ చేసే కొన్ని పనులు అతని స్థాయికి తగ్గట్టు లేవు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఛాన్స్ దొరికిన ప్రతీసారి పరోక్షంగా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఇతను పోస్ట్ లు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో అతను తెలివిగా ఎన్టీఆర్ ను , రాజమౌళిని పొగుడుతూ ఓ ట్వీట్ వేశాడు. ఆ తర్వాతి ట్వీట్ లో రాంచరణ్ ను గుంపులో గోవిందా అన్నట్టు ట్యాగ్ చేసి పెట్టాడు. ఈ విషయాన్ని అభిమానులు కాస్త ఆలస్యంగా గుర్తించారు. ఆ ట్వీట్లు వేసిన టైమింగ్స్ చూసి షాక్ అయ్యారు.

ఆ విషయాలను పక్కన పెట్టేస్తే.. అల్లు అర్జున్ ఇటీవల ఓ హీరోయిన్ తన ట్విట్టర్లో బ్లాక్ చేశాడు. దీంతో ఆ హీరోయిన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ వేసింది. అల్లు అర్జున్ బ్లాక్ చేసిన హీరోయిన్ మరెవరో కాదు అతనితో ‘వరుడు’ సినిమాలో కలిసి నటించిన భానుశ్రీ మెహ్రా. 2010లో వచ్చిన ‘వరుడు’ మూవీ పెద్ద ప్లాప్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో భానుశ్రీ మెహ్రాకి కూడా హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదు.

‘అలా ఎలా?’ ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి సినిమాల్లో నటించింది. కానీ అవి పెద్దగా గుర్తుండిపోయే పాత్రలు అయితే కాదు. అయితే కొన్నాళ్లుగా ఈమె యూట్యూబ్ ఛానల్ ను నడుపుతుంది. ఆ వీడియో ఎక్కువమందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈమె తనను ఫాలో అయ్యే సెలబ్రిటీలను కూడా ట్యాగ్ చేస్తుంది. ఇందులో భాగంగా తరచూ అల్లు అర్జున్ ఖాతాని ట్యాగ్ చేయడం వల్లే అనుకుంట..

ఈమెను అతను బ్లాక్ చేయడం జరిగిందని స్పష్టమవుతుంది. దీనికి ఆమె ఎమోషనల్ అవుతూ ఓ ట్వీట్ కూడా పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే కొంతసేపటి తర్వాత తిరిగి అల్లు అర్జున్ ఈమెను అన్ బ్లాక్ చేయడం కూడా జరిగింది. అందుకు అతన్ని విమర్శించొద్దు అంటూ మరో పోస్ట్ పెట్టింది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus