స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి ఐకాన్ స్టార్ గా మారారనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో సాధించిన కలెక్షన్లను చూసి ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం షాకయ్యారు. పుష్ప ది రైజ్ సక్సెస్ వల్ల పుష్ప ది రూల్ బడ్జెట్ కూడా పెరిగిందని సమాచారం అందుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పుష్ప ది రైజ్ తెరకెక్కగా ఈ సినిమా కోసం బన్నీ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా తీసుకున్నారు. పుష్ప ది రూల్ కు బన్నీ హిందీ రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. ఫలితంగా పుష్ప ది రైజ్ కు తీసుకున్న రెమ్యునరేషన్ తో పోలిస్తే మరింత ఎక్కువ మొత్తం బన్నీకి పారితోషికంగా దక్కనుందని సమాచారం అందుతోంది. బన్నీ పుష్ప ది రూల్ బాలీవుడ్ రైట్స్ తీసుకుని మంచి పని చేశారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఏప్రిల్ నుంచి పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం . షూటింగ్ అనుకున్న విధంగా జరిగితే ఈ ఏడాదే పుష్ప ది రూల్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. డిసెంబర్ నెలలోనే పుష్ప ది రూల్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. పుష్ప ది రైజ్ తో పోలిస్తే పుష్ప ది రూల్ కు సుకుమార్ కూడా ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ కు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.
పుష్ప ది రూల్ కూడా ఘన విజయం సాధిస్తే బాలీవుడ్ లో బన్నీ మార్కెట్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. బన్నీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పుష్ప2 తర్వాత బన్నీ ప్రాజెక్టులకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.