Allu Arjun: ఆ రోల్ ను అలా ఏమీ చూడరు.. అల్లు అర్జున్ చెప్పిన విషయాలివే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ తో (Pushpa) ఇండస్ట్రీ హిట్ సాధించిన బన్నీ పుష్ప ది రూల్ (Pushpa 2) తో అంతకు మించిన హిట్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ సినిమాలో తన రోల్ స్మగ్లర్ అని చెప్పిన వెంటనే కంగారు పడలేదని బన్నీ అన్నారు.

తాను స్మగ్లర్ రోల్ లో నటించినా ఆ రోల్ ప్రభావం ప్రేక్షకులపై ఉండదని ఆయన వెల్లడించారు. ఈ కథా నేపథ్యం జరిగే సమయం సమయం వేరు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. పుష్ప మూవీ, టైటిల్ చూసిన వెంటనే ఈ సినిమా కల్పిత కథ అని అర్థమవుతుందని ఆయన కామెంట్లు చేశారు. నా రోల్ ను స్పూర్తిగా తీసుకుంటారని నేను అనుకోవడం లేదని బన్నీ వెల్లడించారు. ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్లు అని సినిమాను సినిమాలా మాత్రమే చూస్తారని బన్నీ వెల్లడించారు.

తాను గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే పుష్ప మాసీగా ఉంటుందని ఇలాంటి రోల్స్ అరుదుగా వస్తాయని బన్నీ పేర్కొన్నారు. నటుడిగా నేను ప్రయోగాలు చేయాలని అనుకుంటానని పుష్పలాంటి రోల్ నేను ఎప్పుడూ పోషించలేదని ఆయన పేర్కొన్నారు. పుష్ప బ్యాక్ డ్రాప్ లో తెలుగులో సినిమాలు ఎప్పుడూ రాలేదని బన్నీ వెల్లడించారు. వచ్చినా ఈ స్థాయిలో కథ ప్రపంచాన్ని చూపించలేదని అల్లు అర్జున్ అన్నారు.

ఇలాంటి కథతో వస్తున్న మొదటి నటుడిని నేనేనేమో అని బన్నీ వెల్లడించారు. కమర్షియల్ సినిమాలలో గ్లామర్ ఉంటుందని ఆ పరిధి దాటి నేను చేయాలని అనుకుంటున్నానని బన్నీ అన్నారు. అందులో భాగమే పుష్పరాజ్ అని ఆయన తెలిపారు. బన్నీ వెల్లడించిన ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప2 ఫస్ట్ సింగిల్ లో బన్నీ వేసిన స్టెప్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus