తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో 13వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న స్టైలిష్‌స్టార్

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో 13వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు
…. స‌రైనోడు చిత్ర యూనిట్
గంగోత్రి చిత్రం తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రి కి ప‌రిచ‌య‌మ‌య్యి త‌న న‌ట‌న‌తో ముఖ్యంగా త‌న స్టైలింగ్ తో త‌న‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేస‌కున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ వెండితెర‌కి పరిచయమైన త‌రువాత త‌న 13వ పుట్టిన‌రోజుని జరుపుకుంటున్నారు. మెగాఫ్యామిలి హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఫ్యామిలి ఇమేజ్ కి కాపాడుకుంటూ త‌న‌ని తాను మ‌లుచుకుంటూ చేసిన ప్ర‌తి పాత్ర‌లో ఒదిగి పోతూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ 13 సంవ‌త్సారాలు అభిమానుల హ్రుద‌యాల్లో స్టైలిష్‌స్టార్ గా సుస్థిర‌స్థానాన్ని సంపాయించుకున్నారు అల్లు అర్జున్‌. ఫ్యామిలి ఆడియ‌న్స్ అల్లు అర్జున్ అంటూ పిలిచినా.. మాస్ ఆడియ‌న్స్ బ‌న్ని అని పిలిచినా.. పిల్ల‌లు ఆర్య అని పిలిచినా ..అభిమానులు స్టైలిష్‌స్టార్ అని పిలిచినా అటు అభిమానుల‌కి ఇటు నిర్మాత‌ల అంద‌రికి అందుబాటులో వుంటూ మా బ‌న్ని అనిపించుకుటున్నాడు. చేసే ప్ర‌తి చిత్రంలొనూ ఓ వైవిధ్య‌మైన పాత్ర చేస్తూ , ద‌ర్శ‌కుడు ఏ కేర‌క్ట‌ర్ ఇచ్చినా ఒదిగి న‌టిస్తాడు. బ‌న్ని తో చేసిని ఏ ద‌ర్శ‌కుడైనా మ‌ళ్ళి మ‌ళ్ళి పనిచేయాల‌నుకోవ‌టం బ‌న్ని విశేషం. మెగా ప్రోడ్యూస‌ర్ నిర్మాత అనే అహం చూప‌క‌, నిర్మాత కష్ట నష్టాల గురించి ఆలోచించే అతి త‌క్కువ మంది హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుస లో వుంటారు. త‌న డాన్స్ తో తెలంగాణా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా క‌ర్ణాట‌క ముఖ్యంగా కేర‌ళ‌లో స్టార్ హీరోగా ఎదిగారు. ట్విట్ట‌ర్, ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఫేస్‌బుక్ లో కోటి కి పైగా లైక్స్ సాధించిన మెట్ట‌మెద‌టి హీరోగా రికార్డు కూడా నెల‌కొల్పాడు. అంతే కాకుండా వేదం చిత్రం తో మ‌ల్టిస్టార‌ర్ చిత్రాల‌కి తిరిగి శ్రీకారం చుట్టారు. రుద్ర‌మ‌దేవి లాంటి హిస్టారిక‌ల్ ఫిల్మ్ లో చిత్ర యూనిట్ ని కమ‌ర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చేయ‌టానికి త‌న ఇమేజ్ ని ప‌క్క‌న పెట్టి గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌లో ప్రాణం పోసాడు. ప్ర‌స్తుతం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో అత్యంత‌భారీగా నిర్మించిన స‌రైనోడు చిత్రం చేశాడు. ఆడియో ఏప్రిల్ 1న విడుద‌ల‌య్యి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. ఏప్రిల్ 10 న విశాఖ‌ప‌ట్నం లో అత్యంత భారీగా ఆర్‌.కె బీచ్ లో దాదాపు రెండు కిలోమీట‌ర్ల ప‌రిధిలో పూర్తి ఎల్‌.ఇ.డి స్క్రీన్స్ తో మెట్ట‌మెద‌టి సారిగా ఆడియో సెల‌బ్రేష‌న్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌లో 13వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కి స‌రైనోడు చిత్ర యూనిట్ త‌రుపున జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus