టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) డ్యాన్స్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎలాంటి స్టెప్ అయినా ఒత్తిడి లేకుండా, గ్రేస్‌తో చేసేయగల తన స్టైల్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోతుంటారు. అయితే ఈ టాలెంట్ వెనుక చిరంజీవి (Chiranjeevi) ప్రభావం ఉందని చాలామంది భావిస్తారు. మెగా ఫ్యామిలీ హీరోలు చిరు స్టెప్పులు ఫాలో అయ్యారని, అందరూ మెగాస్టార్ ప్రభావంతోనే డ్యాన్స్‌లో ముందుకు వచ్చారని అనుకునేవాళ్లు ఎక్కువ. కానీ తాజాగా అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన ఒక కామెంట్ హాట్ టాపిక్ గా మారింది.
‘తండేల్’ (Thandel) ప్రెస్ మీట్‌లో, అల్లు అరవింద్‌ను డ్యాన్స్ చేయమని యాంకర్ అడిగింది. దీనికి ఆయన, “నాకు డ్యాన్స్ రాదు, పాట వింటే కాళ్లు కదులుతాయి అంతే. కానీ మా అబ్బాయికి డ్యాన్స్ టాలెంట్ నా నుంచి రాలేదు, అది వాళ్ల అమ్మ నుంచి వచ్చింది” అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ డ్యాన్స్ టాలెంట్ గురించి ఎప్పుడూ చిరంజీవి ఇన్‌ఫ్లుయెన్స్ అని చెప్పుకునే మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ మాటల్ని ఎలాంటి అర్థంలో తీసుకోవాలో తెలియక కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారు.
అయితే అరవింద్ వ్యాఖ్యలకు అల్లు ఫ్యాన్స్ మాత్రం పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. “అరె, అన్నీ చిరు వల్లనే అనుకోవద్దు. బన్నీకి తన తల్లివల్లే మంచి డ్యాన్స్ స్కిల్స్ వచ్చాయి” అనే కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహా వాదనలు ఇప్పటికే మెగా-అల్లు ఫ్యాన్స్ మధ్య ఉన్న సైలెంట్ వార్‌ను మరోసారి తెరమీదికి తెచ్చేశాయి. దీనికి తోడు, అల్లు అర్జున్ ఇప్పటి వరకూ తన డ్యాన్స్ గురించిన ప్రశ్నలకు ఎప్పుడూ చిరంజీవి ప్రభావంపై ఎక్కువగా మాట్లాడలేదు.
తన డ్యాన్స్ స్టైల్‌కి తన మ్యానరిజమ్‌కి తానే రీజన్ అని చెప్పుకొచ్చాడు. అరవింద్ తాజా వ్యాఖ్యలతో అది మరింత క్లారిటీకి వచ్చింది. మెగా క్యాంప్‌లో నుంచి ఈ మాట రావడం కొందరికి సర్‌ప్రైజ్ కాగా, మరికొందరికి ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నట్టుగా మారింది. ఏదేమైనా, బన్నీ డ్యాన్స్ వెనుక అసలు మూలం ఎవరు? అనే చర్చ మళ్లీ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.