బన్నీ మాటకు కే‌సి‌ఆర్ ప్రోద్భలం..!

రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రలో నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వాడే ఊతపదం ‘గమ్మునుండవోయ్’. ఈ పదం సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ డైలాగ్ వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఉన్నాడట.

సరైనోడు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించాడు. రాష్ట్ర విభజన తరువాత కే‌సి‌ఆర్ ఎక్కువగా ‘గమ్మునుండవయ్య’ అనే పదాన్ని ఉపయోగించేవారని, దాంతో ఆ పదాన్ని తాను రుద్రమదేవిలో ఉపయోగించగా, అది ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిందని బన్నీ చెప్పుకొచ్చాడు. కాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం ఏప్రిల్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus