అల వైకుంఠపురంలో మూవీ ఇచ్చిన విజయంతో బన్నీ రేంజ్ మరో స్థాయికి చేరింది. ఈ చిత్రంతో నాన్ బాహుబలి రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. బన్నీ-త్రివిక్రమ్ ల ఈ హ్యాట్రిక్ మూవీ వాళ్ళిద్దరికీ కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచింది. త్రివిక్రమ్ క్లాస్ టేకింగ్, బన్నీ అద్భుత నటన థమన్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ కలగలిపి మూవీ అఖండ విజయం సాధించింది. ఐతే ఈ మూవీ ఇచ్చిన స్ఫూర్తితో బన్నీ పాన్ ఇండియా మూవీ పై కన్నేశారట. ఆయన ఖచ్చితంగా పాన్ ఇండియా చేయాలనీ డిసైడ్ అయ్యారట. అలాగే అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో పాన్ ఇండియాకి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట.
సుకుమార్ తో చేస్తున్న చిత్రాన్ని ఆయన పలు భాషలలో విడుదల చేయాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఎటూ సుకుమార్ కథలు యూనివర్సల్ గా ఉంటాయి. కాబట్టి పాన్ ఇండియా లెవెల్ విడుదల చేయడం వలన సక్సెస్ సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన ఉదేశ్యం గా తెలుస్తుంది. అందుకే ఈ మూవీ క్యాస్టింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న బన్నీ, పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులను తీసుకొనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బన్నీ అభిమానులు ఎప్పటికి నుండో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ ఇదే అయ్యే అవకాశం కలదు.
డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!