Allu Arjun: ఆ వీడియోలను వైరల్ చేస్తున్న బన్నీ అభిమానులు.. ఏం జరిగిందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  నటిస్తున్న పుష్ప ది రూల్ (Pushpa2)  మూవీ రిలీజ్ కు సరిగ్గా 100 రోజుల సమయం మాత్రమే ఉంది. మరో 100 రోజుల్లో పుష్పరాజ్ బాక్సాఫీస్ ను రూల్ చేయబోతున్నాడంటూ మేకర్స్ రిలీజ్ చేసిన ఒక పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బన్నీ గురించి, బన్నీ ఫ్యాన్స్ గురించి తాజాగా చేసిన కామెంట్లు ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే.

Allu Arjun

వైరల్ అయిన కామెంట్స్ బన్నీ అభిమానులను సైతం ఒకింత హర్ట్ చేశాయి. అయితే ప్రస్తుతం జనసేనలో ఉన్న ఈ నేత గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ సమయంలో మహానాడు వేదికపై బొలిశెట్టి శ్రీనివాస్ పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయగా ఆ వీడియోలను బన్నీ అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ ను విమర్శించిన నేతలు ఇప్పుడు బన్నీని విమర్శించడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు, బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఇలాంటి నేతల విషయంలో పవన్ కళ్యాణ్ సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. బన్నీకి ఫ్యాన్స్ లేరని అర్థం వచ్చేలా బొలిశెట్టి శ్రీనివాస్ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో బన్నీ ఫ్యాన్స్ భారీ ర్యాలీలు చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీని విమర్శిస్తే తాము ఊరుకోమని బన్నీ అభిమానులు చెబుతున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్ చెప్పిన తేదీకి రిలీజ్ కాకపోవచ్చని ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండబోదని 2024 బిగ్గెస్ట్ హిట్లలో పుష్ప2 ఒకటిగా నిలవడం పక్కా అని ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్ప3 కూడా ఉంటుందని వార్తలు వస్తున్నా ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.

ఆ యావరేజ్ మూవీ ఇష్టమని చెప్పిన సితార.. ఏ మూవీ పేరు చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus