Sitara, Mahesh Babu: ఆ యావరేజ్ మూవీ ఇష్టమని చెప్పిన సితార.. ఏ మూవీ పేరు చెప్పారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో చాలా సినిమాలు వెండితెరపై ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేశాయి. అయితే మహేష్ సినిమాలు బుల్లితెరపై కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి అభిమానులను మెప్పించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. మహేష్ (Mahesh Babu) త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు (Athadu) , ఖలేజా (Khaleja) , గుంటూరు కారం (Guntur Kaaram) థియేటర్లలో ఎలాంటి ఫలితాలను అందుకున్నా బుల్లితెరపై మాత్రం మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్నాయి. అయితే మహేష్ బాబు నటించిన సినిమాలలో సితారకు (Sitara) ఇష్టమైన సినిమా ఏదనే ప్రశ్నకు ఖలేజా సినిమా పేరు జవాబుగా వినిపిస్తోంది.

Sitara, Mahesh Babu

ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సితార మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఖలేజా సినిమాలో సీతారామరాజు రోల్ ఐకానిక్ రోల్ అని సితార అభిప్రాయపడ్డారు. థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఖలేజా మూవీ తనకు ఇష్టమైన మూవీ అని సితార చెప్పడం గమనార్హం. మహేష్ బాబు అభిమానులలో సైతం చాలామంది ఖలేజా మూవీ తమ ఫేవరెట్ మూవీ అని చెప్పిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఖలేజా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమిని ఛానల్ సొంతం చేసుకోగా బుల్లితెరపై ఈ సినిమా చాలాసార్లు ప్రదర్శితమైనా ఇప్పటికీ మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం కొసమెరుపు. ఖలేజా సినిమా రిలీజ్ సమయంలో కమర్షియల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అప్పట్లో ఈ సినిమా టైటిల్ సైతం వివాదంలో చిక్కుకుంది.

మహేష్ (Mahesh Babu) కెరీర్లో ఎక్కువ రోజులు షూట్ జరుపుకున్న సినిమాలలో ఈ సినిమా సైతం ఒకటి కావడం గమనార్హం. మహేష్ ప్రస్తుతం రాజమౌళి (S. S. Rajamouli) సినిమాకే పరిమితం కాగా ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ రావడం లేదు. మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

వినోద్ కుమార్..సెకండ్ ఇన్నింగ్స్ కి బూస్టప్ అందినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus