Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాలో అయ్యే రెండు సెంటిమెంట్లు తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు (Allu Arjun) ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల వైకుంఠపురములో (Ala Vaikunthapurramulo), పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) సినిమాలు బన్నీ మార్కెట్ ను అమాంతం పెంచేశాయి. నార్త్ బెల్ట్ లో సైతం అల్లు అర్జున్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే బన్నీ సినిమాలను గమనిస్తే ఆయన ఎక్కువగా రెండు సెంటిమెంట్లను ఫాలో అవుతున్నారని అర్థమవుతోంది.

అల్లు అర్జున్ తన సినిమాలను ఎక్కువగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు. బన్నీ నటించి ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మరోవైపు బన్నీ తన సినిమాలను వైజాగ్ లో షూట్ చేయడానికి ఇష్టపడతారని భోగట్టా. ఈ రెండు సెంటిమెంట్లను బన్నీ మెజారిటీ సందర్భాలలో ఫాలో అవుతారని సమాచారం అందుతోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్ లో తెరకెక్కనుంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా నాలుగో సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా హారిక హాసిని బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

అల్లు అర్జున్ తన సినిమాల హీరోయిన్ల విషయంలో, కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లకు బన్నీ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని తెలుస్తోంది. బన్నీ నిదానంగా సినిమాలు చేయడంపై ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus