Allu Arjun: నాని డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్న బన్నీ.. కానీ?

  • July 1, 2023 / 08:33 AM IST

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో దసరా మూవీ ఒకటి కాగా ఈ సినిమాతో నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చేరింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు సైతం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో తెలీదు. మరోవైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కొన్నిరోజుల క్రితం ఒక ఇంటివాడయ్యారనే సంగతి తెలిసిందే.

అయితే బన్నీ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దసరా సినిమా రిలీజ్ సమయంలో శ్రీకాంత్ ను అభినందించిన బన్నీ మంచి కథ ఉంటే చెప్పాలని శ్రీకాంత్ కు సూచనలు చేసినట్టు సమాచారం. మరి శ్రీకాంత్ అద్భుతమైన కథ చెప్పి బన్నీని మెప్పిస్తాడేమో చూడాలి. పుష్ప2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కనుంది.

బన్నీ (Allu Arjun) త్రివిక్రమ్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు తెరకెక్కగా ఈ సినిమాలన్నీ ఒక సినిమాను మించి మరొకటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే బన్నీ లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ క్రేజ్ మరింత పెరిగితే బాగుంటుందని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బన్నీ, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే మాత్రం మామూలుగా ఉండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు రేంజ్ ను పెంచుకుంటున్న బన్నీ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుసగా పాన్ ఇండియా స్థాయిలో బన్నీ సక్సెస్ లను సొంతం చేసుకొని నంబర్1 హీరోగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో బన్నీ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus