ఒక సినిమా గురించి వచ్చే వార్త కానీ, పుకారు కానీ ఆ ప్రాజెక్ట్ మీద ఫుల్ క్లారిటీ ఇస్తుంది అంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఏకంగా మూడు సినిమాల విషయంలో క్లారిటీ ఇచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఎందుకంటే టాలీవుడ్లో ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతోంది. క్లారిటీ వచ్చిన విషయం ఫస్ట్ చూస్తే అల్లు అరవింద్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని ఇద్దరూ కలసి ప్రకటించారు. అయితే హీరో ఎవరు అనేది చెప్పలేదు.
మామూలుగా అయితే గీతా ఆర్ట్స్‌లో సినిమా అనౌన్స్ అయితే అది బన్నీతోనే అని అనక్కర్లేదు. ఎందుకంటే ఈ మధ్య గీతా ఆర్ట్స్‌లో ఒకప్పటిలా ఇతర హీరోలతో సినిమా చేస్తున్నారు. అలా ఇప్పుడు బోయపాటి సినిమా వేరే ఎవరో హీరోతో అని చెప్పేయొచ్చు. బన్నీతోనే అయితే ఆ విషయమే చెప్పేవారు. ఈ న్యూస్‌తో బోయపాటి సినిమా, బన్నీ (Allu Arjun) సినిమా, అలాగే బాలకృష్ణ సినిమా ‘అఖండ 2’ విషయంలో క్లారిటీలు వచ్చేశాయి.
మరోవైపు ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఏ సినిమా చేస్తారు అనే విషయంలో గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమా ఆలస్యమవుతుంది అని కొందరు అంటే.. లేదు లేదు బన్నీ సినిమానే అన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప 2’ తర్వాత అట్లీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాడట. ఈ మేరకు బన్నీ క్లారిటీ ఇచ్చేశాడు అంటున్నారు. త్వరలోనే సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందట. దీంతో వెంకటేశ్, నాని కాంబినేషన్లో మల్టీస్టారర్‌కు లైన్ క్లియర్ అని చెబుతున్నారు.
అయితే ఈ విషయాలన్నింటిలో ఎక్కడా అధికారిక సమాచారం రాలేదు. వీటిలో ఏ ఒక్క ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చినా టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల అప్డేట్లు వరుసకడతాయి. ఎందుకంటే ఫుల్ స్వింగ్‌లో ఉన్న టాలీవుడ్‌కి ఈ ప్రాజెక్టుల్లో కన్ఫ్యూజన్ ఇబ్బందిపెడుతోంది. సో వీటిలో ఏదో సినిమా అప్డేట్ అర్జెంట్‌గా రావాలి.