Allu Arjun: సింప్లిసిటీతో ఫిదా చేసిన అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో భారీ సక్సెస్ తో జోరుమీదున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్1లో నటిస్తున్నారు. రాజమండ్రికి సమీపంలో ఉన్న మారేడుమిల్లిలో ప్రస్తుతం పుష్ప షూటింగ్ జరుగుతోంది. పుష్ప చివరి షెడ్యూల్ కు సంబంధించిన సీన్లను సుకుమార్ షూట్ చేస్తుండగా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. అయితే బన్నీ తాజాగా సింప్లిసిటీతో ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేశారు. గత కొన్నిరోజులుగా మారేడుమిల్లి ప్రాంతంలో వర్షం కురుస్తుండటంతో షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

ప్రస్తుతం బన్నీ మారేడుమిల్లి చుట్టుపక్కల ప్రాంతాలను చుట్టేస్తూ ఆ ప్రాంతలకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంటున్నారు. తాజాగా కాకినాడలోని థియేటర్ లో సీటీమార్ సినిమాను చూసిన అల్లు అర్జున్ గోకవరంలో రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో టిఫిన్ చేశారు. బన్నీకి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పుష్ప పార్ట్1 రిలీజైన తర్వాత బన్నీ ఐకాన్ సినిమాలో నటించబోతున్నారు. ఐకాన్ సినిమా షూటింగ్ ఎప్పడినుంచి మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

దర్శకుడు వేణు శ్రీరామ్ ఐకాన్ స్కిప్ట్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఐకాన్ సినిమాకు దిల్ రాజు నిర్మాత కాగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఐకాన్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. బన్నీ భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలు సాధించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus