ఈ ఏడాది అల్లు అర్జున్ .. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి1’ కలెక్షన్లనే అధిగమించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. 162 కోట్ల షేర్ వరకూ రాబట్టింది. బన్నీ మార్కెట్ ను కూడా పెంచిందనే చెప్పాలి. అందుకే బన్నీ నటిస్తున్న నెక్స్ట్ మూవీ ‘పుష్ప’ను పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి బన్నీ తీసుకోబోతున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి బన్నీ.. 25కోట్ల వరకూ పారితోషికం అందుకున్నాడట. దాంతో పాటు లాభాల్లో 25శాతం వాటా కూడా తీసుకున్నాడట. ఇప్పుడు ‘పుష్ప’ చిత్రానికి బన్నీ భారీగానే అందుకోబోతున్నాడట.ఈ చిత్రానికి ఏకంగా 35 కోట్ల వరకూ పారితోషికం తీసుకోబోతున్నాడని తెలుస్తుంది. అంతేకాదు ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి అందుకున్నట్టే.. ‘పుష్ప’ చిత్రానికి కూడా లాభాల్లో వాటా తీసుకోబుతున్నాడట.
ఇప్పటి వరకూ టాలీవుడ్ లో ప్రభాస్,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. వంటి హీరోలు మాత్రమే అత్యధికంగా 40 కోట్ల నుండీ 50 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ లు … ఇప్పటి వరకూ 25కోట్ల వరకూ మాత్రమే పారితోషికం అందుకుంటూ వచ్చారు. ఇప్పుడు బన్నీ ‘పుష్ప’ చిత్రానికి 35 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటూ.. టాప్ 4 ప్లేస్ కు వచ్చేసాడు.
Most Recommended Video
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!