Allu Arjun: నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. వైరల్ అవుతున్న ఫోటో.!

  • October 17, 2023 / 10:03 PM IST

ఈ మధ్యనే 2021 సంవత్సరానికి నేషనల్ అవార్డులు గెలుచుకున్న విజేతల లిస్ట్ ను అనౌన్స్ చేశారు. ఈరోజు ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులను అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘పుష్ప’ చిత్రానికి గాను ఉత్తమ జాతీయ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది అల్లు అర్జున్.

అల్లు అర్జున్ భార్య స్నేహ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఇక తెలుగు సినిమా చరిత్రలో ఓ తెలుగు హీరో ఇలా నేషనల్ అవార్డు అందుకోవడం అనేది ఇదే మొదటిసారి కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ‘పుష్ప’ చిత్రానికి గాను సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా నేషనల్ అవార్డు అందుకున్నాడు. అలాగే ‘కొండపొలం’ చిత్రానికి గాను చంద్రబోస్ కూడా ఈ పురస్కారం అందుకోవడం జరిగింది.

ఇక ‘పుష్ప’ చిత్రంలో (Allu Arjun) అల్లు అర్జున్ వన్ మెన్ షో చేశాడని చెప్పొచ్చు. పుష్పరాజ్ గా అతని నటన, మేకోవర్ వంటివి తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా నార్త్ ఆడియన్స్ ను కూడా అమితంగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. దీంతో ‘పుష్ప 2’ పై కూడా నార్త్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తప్పకుండా ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఎక్కువగానే ఉంది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus