తమిళ్ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో నటించనున్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఏ సినిమా కన్ఫర్మ్ చేస్తాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడనే వార్త వినిపించింది. కానీ రీసెంట్ గా ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అల్లు అర్జున్ రాగ నీ నెక్స్ట్ సినిమా ఏంటి అని కొందరు అభిమానులు ఆ ఫంక్షన్ లో అడుగగా దానికి జవాబు చెప్పకుండా ఉండిపోవడంతో అసలు నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా ఉందొ లేదో అని అభిమానులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ మనసు ఒక తమిళ సినిమా పైన పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

విషయంలోకి వెళితే, ఇటీవలే తమిళ్ లో ’96’ అనే సినిమా రిలీజై సూపర్ హిట్ అయింది. రిలీజ్ అయినా కొద్దీ రోజులకే టివి లో సినిమా వచ్చినప్పటికీ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గట్లే అంట. ఇలా ప్రేక్షకులని కట్టిపడేసిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ని నిర్మాత దిల్ రాజు తీసుకున్నాడట. అయితే ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ కి సినిమా ఎంతగానో నచ్చిందట. దీంతో దిల్ రాజు ’96’ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ని సంప్రదించగా, అల్లు అర్జున్ ఈ సినిమా తెలుగు నేటివిటీ కి సెట్ అయ్యేలా కొన్ని మార్పులు చేయమని డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తో చెప్పాడట. మరి అల్లు అర్జున్ మనసు పారేసుకున్న ఈ సినిమానే తన నెక్స్ట్ సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అల్లుఅర్జున్ నెక్స్ట్ ఏ సినిమా కన్ఫర్మ్ చేస్తాడనే సస్పెన్స్ వీడాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus