అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్న అల్లు అర్జున్ దంపతులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నటనతో స్టార్ హీరో అనిపించుకున్నారు. స్టెప్పులతో అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ బన్నీకి అభిమాన సంఘాలు ఉన్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి అప్డేట్స్ ఇస్తుంటారు. సమాజంలోని జరిగే సంఘటనలపై స్పందిస్తుంటారు. అభిమానులు, నెటిజనులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అందుకే అల్లు అర్జున్ ని సోషల్ మీడియా రాజుగా అభిమానులు పిలిచుకుంటుంటారు. అతని భార్య స్నేహ కూడా తానేమి తక్కువకానని నిరూపించుకుంది. సోషల్ మీడియా రాణిగా పేరు దక్కించుకుంది. ఆమె ఫేస్ బుక్, ట్విట్టర్లో యాక్టీవ్ గా ఉండనప్పటికీ ఇన్‌స్టాగ్రాంలో చురుకుగా ఉంటారు.

ప్రతిరోజు తన గురించి, కుటుంబం గురించి ఏదో విషయాన్ని పోస్ట్ చేస్తూ 1 మిలియన్ ఫాలోవర్స్ క్లబ్‌లో చేరడానికి అతి చేరువలో ఉంది. హీరోయిన్ కాకపోయినప్పటికీ ఇంతమంది ప్లావర్స్ ని సొంతం చేసుకోవడం నెటిజనులను ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ మాత్రమే ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో 1 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నారు. స్టార్ భార్య హోదాలో ఉండి 1 మిలియన్ క్లబ్‌లో చేరబోతున్న రెండో ఆమె స్నేహ. తెలుగులో అయితే మొదటి స్థానాల్లో నిలుస్తారు. అందుకే ఆమెకు సోషల్ మీడియా రాణిగా పిలుచుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus