Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ
- April 8, 2026 / 03:29 PM ISTByPhani Kumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది అట్లీ అండ్ టీమ్.అట్లీ- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘రాకా’(Raaka) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Raaka
ఈ పోస్టర్ యావత్ టాలీవుడ్ ప్రేక్షకులకి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. సాధారణంగా అట్లీ సినిమాల్లో కానీ అల్లు అర్జున్ సినిమాల్లో కానీ లుక్స్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. కానీ ‘రాకా’ ఫస్ట్ లుక్‌లో బన్నీని విచిత్రమైన గెటప్‌లో ప్రజెంట్ చేశారు.

ఈ లుక్ చూస్తుంటే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమాలో విక్రమ్ ‘బీస్ట్’ గెటప్, అలాగే కార్తీ నటించిన ‘కాష్మోరా’ సినిమాలోని నెగెటివ్ షేడ్ ఉన్న రెండో పాత్రకి సంబంధించిన లుక్స్ గుర్తుకొస్తున్నాయి అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అందులో ఒక పాత్ర పక్కా విలనిజంతో నిండి ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. బహుశా ఈరోజు విడుదలైన పోస్టర్ ఆ విలన్ క్యారెక్టర్‌కు సంబంధించిందే అయ్యుండొచ్చు.
అట్లీ తన గత చిత్రాలైన ‘మెర్సల్’ ‘బిగిల్’ తరహాలోనే ఇందులోనూ బన్నీని రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో చూపించబోతున్నారని తెలుస్తుంది. ఇక నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రకి జోడీగా రష్మిక మందాన నటించబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.
మన స్టార్ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్ శరవణన్













