అల్లు అర్జున్ తన కెరీర్ ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటున్నారు. లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చి.. క్లాస్ ప్రజలను ఆకట్టుకొని.. యాక్షన్ సినిమాలతో మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మాస్ క్లాస్ కలిపి సరైనోడుతో స్టార్ హీరోగా స్థిరపడిపోయారు. ఇప్పుడు అతని కన్ను ఇతర రాష్ట్రాలపై పడింది. అక్కడ కూడా పాగా వేయాలని బాగా ప్లాన్ వేస్తున్నారు. అందుకోసమే తమిళ డైరక్టర్ లింగు స్వామికి ఒకే చెప్పారు. అతని దర్శకత్వంలో కోలీవుడ్ లోకి అడుగు పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతన్నే పక్కన పెట్టారని తెలిసింది. లింగు స్వామి చిత్రానికి కోలీవుడ్ లో మాత్రమే క్రేజ్ ఉంటుందని ఇతర భాషల్లో క్రేజ్ ఉండదని గ్రహించిన బన్నీ ప్లాన్ చేంజ్ చేశారు. మనం, 24 సినిమాలతో విక్రమ్ కుమార్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బాగా పాపులర్ అయ్యారు.
ఓవర్ సీస్ లో అతని సినిమాకి మంచి మార్కెట్ ఉంది. అందుకే అతనితో ద్విభాషా చిత్రం చేస్తే సులువుగా ఇతర ఇండస్ట్రీలో పాతుకుపోవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు విక్రమ్ కుమార్ అఖిల్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ తరవాత అతని డేట్స్ పట్టేసేందుకు ఇప్పటినుంచే ప్రయత్నిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం చేస్తున్నారు. ఇది పూర్తి కావచ్చింది. ఆ తర్వాత వక్కంతు వంశీ తో నాపేరు సూర్య, నా ఊరు ఇండియా మూవీ చేయనున్నారు. ఆ తర్వాత విక్రమ్ కుమార్, బన్నీ కలయికలో మూవీ ఉండొచ్చు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.