Allu Arjun: బన్నీ మురుగదాస్ కాంబోలో మూవీ రానుందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడం కంటే ఎక్కువ విజయాలు దక్కేలా సినిమాలు చేయడంపై దృష్టి పెట్టారు. పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చాలామంది డైరెక్టర్లు భావిస్తుండగా ఆ ఛాన్స్ దక్కే డైరెక్టర్ ఎవరో తెలియాల్సి ఉంది. పుష్ప ది రైజ్ ను మించి పుష్ప ది రూల్ ఉండేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు లాభాల్లో వాటా తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

అయితే గజిని మూవీ సీక్వెల్ లో అల్లు అర్జున్ నటిస్తున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మురుగదాస్ డైరెక్షన్ లో సూర్య హీరోగా తెరకెక్కిన గజిని సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యకు స్టార్ హీరోగా గుర్తింపు దక్కడానికి ఒక విధంగా ఈ సినిమానే కారణమని చాలామంది భావిస్తారు. అయితే గజిని సీక్వెల్ లో బన్నీ నటిస్తారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్తలు బన్నీ అభిమానులకు సంతోషాన్ని కలగజేస్తున్నాయి. ఇప్పటికే మురుగదాస్ గజిని సీక్వెల్ కు గజిని2 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది. అయితే గజిని సీక్వెల్ లో సూర్యనే నటించే అవకాశం ఉందని కూడా కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. మేకర్స్ స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే గజిని సీక్వెల్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

బన్నీ మురుగదాస్ కాంబినేషన్ లో ఒక సినిమా అయితే కచ్చితంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ హీరోలు కోలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించిన మెజారిటీ సందర్భాల్లో ఫలితాలు అనుకూలంగా రాలేదు. బన్నీ ఒక్కో సినిమాకు 90 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో బన్నీ ఒకరని చెప్పవచ్చు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus