Allu Arjun: కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో బన్నీ నిర్ణయమిదేనా?

టాలెంట్ ఉన్నవాళ్లను ప్రోత్సహించే హీరోలలో స్టార్ హీరో బన్నీ ముందువరసలో ఉంటారు. అయితే అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. బన్నీ ఈ సినిమా కోసం ఎంతో శ్రమించినా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కలేదు. నా పేరు సూర్య సినిమా తర్వాత అల వైకుంఠపురములో సినిమాతో బన్నీ ఇండస్ట్రీ హిట్ సాధించారు.

సంక్రాంతి పండుగకు ఈ సినిమా విడుదల కావడంతో సంక్రాంతి సెలవులు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. పుష్ప ది రైజ్ హిందీలో కూడా సక్సెస్ సాధించడం బన్నీ కెరీర్ కు ప్లస్ అయింది. అక్కడి స్ట్రెయిట్ సినిమాలకు సమానంగా పుష్ప ది రైజ్ సినిమా కలెక్షన్లను సాధించింది. వరుస విజయాలతో జోరుమీదున్న బన్నీ తర్వాత ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా బన్నీ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో తర్వాత ప్రాజెక్ట్ లతో బన్నీ షాక్ ఇవ్వబోతున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. బన్నీ మరో పాన్ ఇండియా డైరెక్టర్ తో ప్రాజెక్ట్ ను ప్రకటిస్తారని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ కొత్త కథలు కూడా వింటున్నారని తెలుస్తోంది. కెరీర్ విషయంలో బన్నీ ప్లానింగ్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. మరోవైపు బన్నీ 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సినిమాసినిమాకు అల్లు అర్జున్ కు క్రేజ్ పెరుగుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus