ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా ప్రస్తుతం పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా స్టార్ హీరోగా గుర్తింపు పొందినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్స్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ కి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తూ తండ్రి ప్రమోట్ అయిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి అనే ప్రశ్న అల్లు అర్జున్ కు ఎదురైంది అయితే ఈ ప్రశ్నకు అల్లు అర్జున్ చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పెళ్లి కాకముందు నేను కాస్త ఎక్కువ బూతులు మాట్లాడే వాడిని పెళ్లయిన తర్వాత కాస్త తగ్గించుకున్నానని అయితే పిల్లల పుట్టిన తర్వాత ఈ అలవాటు పూర్తిగా మానుకున్నాను అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియ చేశారు. ఇలా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో (Allu Arjun) అల్లు అర్జున్ కి ఇలాంటి అలవాటు కూడా ఉండేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈయన బూతులు మాట్లాడతారు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు అయితే పిల్లలు పుట్టిన తర్వాత బూతులు మాట్లాడటం మానుకున్నాను అని చెప్పగా చాలా మంచి పని చేశారంటూ నేటిజన్స్ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈయన పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.