Allu Arjun: స్టార్ హీరో అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్.. ఎక్కడో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  ప్రస్తుతం పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ సినిమా నుంచి ఎక్కువగా అప్ డేట్స్ రాకపోయినా ఈ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోందని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమాకు పోటీగా కల్కి రిలీజయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నా ఆ ప్రచారం నిజం కాకపోవచ్చని చాలామంది భావిస్తుండటం గమనార్హం. ఏపీ ఎన్నికల తర్వాత కల్కి (Kalki 2898 AD)  సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

అయితే కల్కి మేకర్స్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. మరోవైపు ఇప్పటికే ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ తో ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుంటున్న అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్ దిశగా కూడా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. వైజాగ్ లో బన్నీ మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వైజాగ్ లో కొత్తగా ఇనార్బిట్ మాల్ ను నిర్మిస్తుండగా అక్కడ ఆసియన్ సంస్థతో కలిసి బన్నీ మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

త్వరలో ఈ మల్టీప్లెక్స్ కు సంబంధించిన వార్తలు నిజమో కాదో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం సినిమాలను చూసే విషయంలో ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. థియేటర్లలో సినిమాలను చూడటం కంటే మల్టీప్లెక్స్ లలో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ లను నిర్మించడం వల్ల ఆ హీరోల బ్రాండ్ వాల్యూ మల్టీప్లెక్స్ లకు ప్లస్ అవుతోంది. తెలుగు హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తుండటం ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని భారీ మల్టీప్లెక్స్ ల నిర్మాణం దిశగా అడుగులు పడనున్నాయని తెలుస్తోంది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus