స్టార్ హీరోల డేట్స్ దొరకడం కోసం చాలామంది డైరెక్టర్లు ఎపుడు క్యూలో ఉంటారు. అయితే మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ బన్నీతో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు చాలా రోజుల నుండి వినిపించగా ఆ సినిమా చర్చల దశలోనే ఉండగా దానిపైన అంత ఆసక్తిని చూపెట్టని బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లుగా గుస గుసలు వినిపిస్తున్నాయి.
ఇలా బన్నీతో సినిమా చర్చల దశలోనే ఆగిపోవడంతో నిరాశ చెందిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ హీరో నాని తో సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం హీరో నాని జెర్సీ సినిమా షూటింగ్ లో ఉన్నారు ఇది పూర్తైన వెంటనే విక్రమ్ కుమార్ తో సినిమా చేయడానికి ఒప్పుకునట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి బన్నీ ఆసక్తి చూపెట్టని కథ తోనే నాని తో సినిమా చేస్తాడా లేదా వేరే ఏదైనా కథ సిద్ధం చేసాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక హలొ సినిమా ప్లాప్ తో ఉన్న డైరెక్టర్ కి నాని ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.