సైరా బడ్జెట్ బయటపెట్టిన అల్లు అర్జున్

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న “సైరా నరసింహారెడ్డి” టీజర్ నిన్న రిలీజ్ అయి ఒక్కొక్క రికార్డును బద్దలు కొడుతోంది. ఇందులో చిరు లుక్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ టీజర్ లో విజువల్స్ చూసిన తర్వాత ఈ చిత్ర బడ్జెట్ పై చర్చ మొదలయింది. ఎంత ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు. అందుకు సమాధానాన్ని టీజర్ రిలీజ్ కార్యక్రమంలో నిర్మాత రామ్ చరణ్ తేజ్ చెప్పడానికి నిరాకరించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆ విషయాన్ని బయటపెట్టారు. “నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఖర్చుకి ఆలోచించలేదు. భారీగా తీస్తున్నాం. లాభాలు వస్తే బోనస్. రాకున్నా ఆనందమే. ‘మగధీర’ చూశాక.. నాన్నగారు నాతో ‘నీ మీద నాకు ఈర్ష్య ఉంది. రెండో సినిమాకి సోషియో ఫాంటసీ డ్రామా చేశావ్. 35 ఏళ్లలో 150 సినిమాలు చేశా. నాకు ఒక్క సోషియో ఫాంటసీ డ్రామా లేదురా’ అన్నారు.

అందుకే అతని కోరికకు సమాధానమే ఈ సినిమా. నాన్న కలను నిజం చేస్తున్నా” అని రామ్‌చ‌ర‌ణ్‌ చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ “చిరంజీవిగారి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 ఎంత కలెక్ట్ చేసిందో… దానికి రెట్టింపు ఈ సినిమా (సైరా) బడ్జెట్ ఉంటుంది. ఖర్చుకు వెనుకాడకుండా అంత భారీగా తీస్తున్నందుకు నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ని అభినందిస్తున్నా” అని చెప్పకనే చెప్పారు. బన్నీ మాటలను బట్టి చూస్తుంటే సైరా బడ్జెట్ 200 కోట్లని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే “ఖైదీ నంబర్ 150 ” సినిమా 100 కోట్ల షేర్ రాబట్టింది. అందుకు రెట్టింపు అంటే 200 కోట్లని భావిస్తున్నారు. అందుకు మించి ఖర్చయినా ఆశ్చర్యం పోనవసరం లేదని చరణ్ సన్నిహితులు స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus