Allu Arjun: పుష్ప2 మూవీ విషయంలో అలా జరుగుతోందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ కథ నచ్చితే ప్రయోగాత్మక పాత్రలలో నటించడానికి సిద్ధంగా ఉంటారనే సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ లో బన్నీ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే పుష్ప పార్ట్1 అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో పుష్ప ది రూల్ విషయంలో కూడా సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పుష్ప2 లో బన్నీ కొంత సమయం పాటు వృద్ధుడిగా కనిపిస్తారని తెలుస్తోంది.

పుష్ప ది రైజ్ లో బన్నీకి పెళ్లైనట్టు మేకర్స్ చూపించారనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ లో బన్నీ 55 సంవత్సరాల వయస్సు వ్యక్తిగా కనిపిస్తారని సమాచారం అందుతోంది. యంగ్ హీరో బన్నీ కొడుకు పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు పుష్ప షూట్ మరింత ఆలస్యం కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరి వరకు పుష్ప2 షూట్ మొదలయ్యే ఛాన్స్ లేదని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పుష్ప ది రూల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. పుష్ప మేకర్స్ 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. రష్మిక, అనసూయ పాత్రలకు పుష్ప ది రూల్ లో కూడా భారీస్థాయిలో ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ బన్నీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అభిమానులు మెచ్చే కథలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు తర్వాత సినిమాలతో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. బన్నీ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus