Allu Arjun, Allu Arha: నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఈ సినిమాపై మరింత ఫోకస్ పెట్టి భారీ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కానున్నారు.

ఈ విధంగా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ తనకు సమయం దొరికినప్పుడల్లా తన పిల్లలతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇకపోతే ఆదివారం డాటర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన కుమార్తె అర్హతతో కలిసి సరదాగా ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు ఈ వీడియోలో తన కూతురు అంటే తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని అల్లు అర్జున్ బయట పెట్టారు.

ఈ వీడియోలో అల్లు అర్హ.ఎంతో ముందుగా చిట్టి చిలకమ్మా రైమ్ చెప్పడమే కాకుండా తన కుమార్తెను తనపై కూర్చోబెట్టుకొని అల్లు అర్జున్ ఎందుకు నువ్వు ఇంత క్యూట్ గా ఉన్నావు.. కొంచెం క్యూట్ అయితే ఓకే మరి ఇంత క్యూట్ అయితే ఎలా అంటూ తన కూతురిని ముద్దాడారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వంటే నా ప్రాణం అంటూ ఈ సందర్భంగా ఈయన తన కుమార్తె పై ఉన్న ప్రేమను బయట పెట్టారు.

ఇక అల్లు అర్జున్ షేర్ చేసినటువంటి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ తండ్రి కూతుర్ల మధ్య ఉన్నటువంటి బాండింగ్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఇదివరకే పలు సందర్భాలలో తన కూతురితో కలిసి ఉన్నటువంటి ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ చిన్నారికి కూడా ఇంత చిన్న వయసులోనే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదివరకే అర్హ శాకుంతలం సినిమాలో కూడా బాలనటిగా నటించిన సంగతి మనకు తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus