Allu Arjun: బన్నీ ప్రశాంత్ మూవీ షూటింగ్ అప్పుడేనా..?

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ అల్లు అర్జున్ ను ఈ సినిమాలో రెండు షేడ్స్ లో చూపించబోతున్నారు. అల్లు అర్జున్ కు జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తుండగా ఈ సినిమా రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్నట్టు కొన్ని నెలల క్రితం ప్రకటన వెలువడింది.

అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఎన్టీఆర్ తరువాత సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల శివ ప్రాజెక్ట్ తాత్కాలికంగా ఆగిపోవడంతో బన్నీ పుష్ప సినిమా తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎన్టీఆర్ తరువాత సినిమా విషయంలో కన్ఫ్యూజన్ నెలకొనే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.

ప్రస్తుతం సలార్ సినిమా పనులతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ పూర్తైన తరువాత ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. బన్నీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా జనవరి నుంచి తెరకెక్కితే మాత్రం బన్నీ ఎన్టీఆర్ కు ఝలక్ ఇచ్చినట్టేనని చెప్పాలి. మరోవైపు వకీల్ సాబ్ హిట్టైనా ఐకాన్ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ ఆసక్తి చూపించడం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తరువాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటిస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus