అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను..లది హిట్టు కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అల్లు అర్జున్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే అల్లు అర్జున్ అంటే బోయపాటికి ఓ ప్రత్యేకమైన అభిమానం. అతని మొదటి సినిమా ‘భద్ర’ కథ కూడా మొదట బన్నీకే చెప్పాడు బోయపాటి శ్రీను. అందుకే ‘అఖండ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి మరీ సినిమాని ప్రమోట్ చేశాడు.
వీరి కలయికలో మరో సినిమా రాబోతున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరిగింది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లోనే ఈ ప్రాజెక్టూ ఉంటుందని చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ కి కూడా బోయపాటి శ్రీనుపై నమ్మకం ఎక్కువే. ‘టాలీవుడ్ కి చాలా అవసరమైన దర్శకుడు బోయపాటి’ అంటూ ఆయన అనేక సార్లు కొనియాడారు. అయితే బోయపాటి, అల్లు అర్జున్..ల కమిట్మెంట్స్ వల్ల వీరి కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు.
కానీ ఇప్పటికీ బోయపాటితో సినిమా చేయాలనే ఆలోచన బన్నీకి ఉంది.కాకపోతే బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బోయపాటి శ్రీను తీసేవి అన్నీ రెగ్యులర్ కమర్షియల్ కథలే. పైగా బోయపాటికి పాన్ ఇండియా ఇమేజ్ లేదు.కానీ ‘అఖండ 2’ తో హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు బోయపాటి శ్రీను.సినిమాలో హిందుత్వం అంశం ఉంది కాబట్టి.. హిందీలో కూడా ‘అఖండ 2’ మంచి విజయం సాధిస్తుందని అక్కడి ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఒకవేళ అదే జరిగితే బోయపాటికి హిందీలో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. అప్పుడు బన్నీ ఏమాత్రం ఆలోచించకుండా బోయపాటితో తో నెక్స్ట్ ప్రాజెక్టు ఖరారు చేసుకుంటారు. అందుకే ‘అఖండ 2’ ఫలితంపై బన్నీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.