ఒకప్పుడు హీరోయిన్లు అంటే ముంబై నుండే దిగేవారు.టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్లు ఎక్కువగా ముంబైకి చెందిన వారే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ కొన్నాళ్ల నుండి చూసుకుంటే.. టాలీవుడ్ కు గ్లామరస్ అండ్ టాలెంటెడ్ బ్యూటీస్ ని అందిస్తుంది కన్నడ సినీ పరిశ్రమ అనే చెప్పాలి. అవును టాలీవుడ్..కి సౌందర్య వంటి బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్స్ ని అందించింది కన్నడ సినీ పరిశ్రమ.
ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో ఎక్కువ రాజ్యం ఏలుతున్న బ్యూటీలు ఎక్కువ శాతం కన్నడ నుండి దిగుమతి అయినవాళ్లే అనే సంగతి చాలా మందికి తెలీకపోవచ్చు. అంతెందుకు టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క సైతం కర్ణాటకకి చెందిన వ్యక్తే. ఎక్కువ మార్కెట్ కలిగిన హీరోయిన్లలో అనుష్క ఒకరు. కాకపోతే కొన్నాళ్ల నుండి ఆమె లుక్స్ పరంగా డిజప్పాయింట్ చేస్తూ వస్తోంది.
‘సైజ్ జీరో’ సినిమా నుండి అనుష్క షేపౌట్ అయ్యింది. అప్పటి నుండి ఆమె ఎంత కష్టపడినా బరువు తగ్గలేకపోతుంది. అయితే ఇప్పుడు ఆమెను ఆషిక రంగనాథ్ రీప్లేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.అందం, అభినయం కలిగిన భామల్లో ఆషిక రంగనాథ్ ఒకరు. కానీ ఆమెకు ఇంకా సరైన హిట్టు పడలేదు. నాగార్జునతో చేసిన ‘నా సామి రంగ’ హిట్ అయ్యింది.
అందులో ఆషిక(Ashika Ranganath) నటన కూడా హైలెట్ గా నిలిచింది. కాకపోతే స్టార్ లీగ్లో చేరడానికి ఓ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. ఆషిక దాని కోసమే కష్టపడుతుంది. ఆమె నటించిన ‘గత వైభవ’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమాలో ఆమెకి సంబంధించిన గ్లామర్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి