అల్లు అర్జున్ (Allu Arjun) .. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కోపాన్ని కొంచెం చల్లార్చాడు. అవును మీరు వింటున్నది నిజమే..! పవన్ కళ్యాణ్ అభిమానులకి.. అల్లు అర్జున్ కి కొంత గ్యాప్ ఏర్పడిన మాట నిజమే. 2016 విడుదలైన ‘సరైనోడు’ (Sarrainodu) సినిమా టైంలో ‘చెప్పను బ్రదర్’ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయ్యాడు అల్లు అర్జున్. ఆ తర్వాత దానికి సంజాయిషీ చెప్పినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనికరించలేదు. ఆ టైంలో మెగా అభిమానులు అల్లు అర్జున్ కి మద్దతు పలికారు.
అండగా నిలబడ్డారు. కానీ తర్వాత వాళ్ళని కూడా అల్లు అర్జున్ కెలుకుతూ వచ్చాడు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల టైంలో జనసేనను కాదని నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి తరఫున ప్రచారం చేసి వచ్చాడు. దీంతో మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై కోపంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) కి హిట్ టాక్ వచ్చినా.. గోదావరి జిల్లాల్లో మాత్రం తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. దీనికి టికెట్ రేట్లు కూడా ఓ కారణం.
ఏదేమైనా ఈ విషయాలతో అల్లు అర్జున్ కాస్త తగ్గాడు అనే చెప్పాలి. ఈరోజు ‘పుష్ప 2’ సక్సెస్ మీట్ జరిగింది. ఇందులో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తూ.. ” ‘పుష్ప 2’ టికెట్ హైక్స్ కి పర్మిషన్ ఇచ్చినందుకు అభినందనలు. అలాగే పర్సనల్ గా ‘కళ్యాణ్ బాబాయ్ థాంక్యూ’ అంటూ చెప్పాడు. అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్లకి ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది అనే చెప్పాలి. మరి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ బన్నీని క్షమించి ‘పుష్ప 2’ ని నెక్స్ట్ లెవెల్..కి తీసుకెళ్తారేమో చూడాలి.
థ్యాంక్యూ సో మచ్ కళ్యాణ్ బాబాయ్ –@alluarjun#AlluArjun #Pushpa2TheRule pic.twitter.com/hFhVgWNgsd
— Filmy Focus (@FilmyFocus) December 7, 2024