‘పుష్ప’ సిరీస్ కోసం ఐదేళ్లు కేటాయించి, తిరుగులేని పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్, ఇప్పుడు తన మార్కెట్‌ను ‘పాన్ వరల్డ్’ రేంజ్‌కు తీసుకెళ్లే పనిలో పడ్డారు. ‘జవాన్’ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే హీరోయిన్‌గా చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ (AA22XA6) కోసం ఆయన రెండేళ్లకు పైగా కేటాయించాల్సి వస్తుండటం ఫ్యాన్స్‌ను కొంత నిరాశపరిచింది. అయితే, బన్నీ ఇప్పుడు రూట్ మార్చినట్లు, వీలైనంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ ఇండస్ట్రీ టాక్ ప్రకారం, బన్నీ తన పార్ట్‌ను త్వరగా పూర్తి చేయడానికి, దర్శకుడు అట్లీకి ఒక పర్సనల్ ‘డెడ్‌లైన్’ ఫిక్స్ చేశారట. 2026 ఏప్రిల్ లేదా మే నాటికి తన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేయాలని బన్నీ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ‘పుష్ప’ కోసం ఐదేళ్లు తీసుకున్న బన్నీ, ఇప్పుడు ఇంత స్పీడ్‌గా ఎందుకు కదులుతున్నాడు? అనేది అసలు పాయింట్. ఇది కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదని, దీని వెనుక పక్కా స్ట్రాటజీ ఉందని అంటున్నారు.
బన్నీ స్పీడ్‌కు అసలు కారణం.. ఆయన కోసం వెయిట్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ల లిస్ట్. అట్లీ సినిమా తర్వాత ఆయన లైనప్ మామూలుగా లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పటికే కథతో రెడీగా ఉన్నాడు. మరోవైపు, ‘సలార్’, ‘KGF’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో దిల్ రాజు భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. వీళ్లందరినీ మించి, ‘గ్లోబ్ ట్రాటర్’ (SSMB29) తర్వాత రాజమౌళి బన్నీతోనే సినిమా చేస్తారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.
రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి గ్లోబల్ డైరెక్టర్లు ఒక హీరో కోసం రెండేళ్లకు మించి ఆగరు. బన్నీ గనుక అట్లీ సినిమాకే ఎక్కువ టైమ్ తీసుకుంటే, ఈ ఇద్దరు డైరెక్టర్లలో ఒకరు మరో స్టార్‌తో లాక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే, బన్నీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకోకూడదనే, అట్లీ సినిమాను త్వరగా ముగించి, ఆ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్లను లాక్ చేయాలని చూస్తున్నాడు. ఇది బన్నీ వేసిన పక్కా స్ట్రాటజిక్ మూవ్.
వీరే కాదు, ‘సరైనోడు’ కాంబో బోయపాటి శ్రీను, ఫ్లాపుల్లో ఉన్నా కొరటాల శివ కూడా బన్నీ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సందీప్ వంగా తో కూడా ఓ సినిమా ఉంటుందని అప్పట్లో అనౌన్స్ చేశారు. మరి అదెప్పుడు ఉంటుందో చూడాలి.
