Allu Arjun, Balakrishna: ఆ ముద్రకు దూరంగా ఐకాన్ స్టార్!

అల్లు అర్జున్ అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కాగా విడుదలైన తర్వాత అఖండ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. వీక్ డేస్ లో కూడా అఖండ మూవీకి చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో అఖండకు నామమాత్రపు పోటీని ఇచ్చే సినిమా కూడా లేదు. అఖండ సక్సెస్ తో బన్నీ కూడా సంతోషిస్తున్నారు. అఖండ సక్సెస్ ను పుష్ప కంటిన్యూ చేస్తుందని బన్నీ నమ్ముతున్నారు.

అయితే అఖండ సక్సెస్ సాధించడంతో బన్నీ బాలయ్య, బోయపాటి శ్రీను, అఖండ టీమ్ సభ్యులకు పార్టీ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది. పుష్ప సినిమా రిలీజయ్యే లోపు ఈ పార్టీ జరగనుందని సమాచారం. బన్నీ ఈ విధంగా పార్టీలు ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాల యూనిట్లను పిలిచి బన్నీ పార్టీ ఇచ్చారు. తనదైన స్ట్రాటజీ, ప్లానింగ్ తో బన్నీ ముందుకు వెళుతున్నారు.

ఇతర ఇండస్ట్రీలలో లేని ఒక మంచి సంప్రదాయానికి బన్నీ శ్రీకారం చుడుతూ అందరివాడుగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైతం బన్నీ మెగా ఫ్యామిలీ హీరోలను కాకుండా స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, కొరటాల శివలను ఆహ్వానించారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అయిన జక్కన్న, కొరటాల శివ పుష్ప సినిమా గురించి పాజిటివ్ గా కామెంట్లు చేసి ఈ సినిమాపై అంచనాలను పెంచారు. అయితే ఇదే సమయంలో బన్నీ మెగా ముద్రకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు పుష్ప సినిమా ప్రమోషన్స్ తెలుగులో భారీస్థాయిలో జరుగుతున్నా ఇతర భాషల్లో మాత్రం సరిగ్గా జరగడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు సుకుమార్ పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటంతో బన్నీ, రష్మిక ఇతర భాషల ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచాల్సి ఉంది. దాదాపుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప పార్ట్1 తెరకెక్కింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus