అల్లు అర్జున్ నటించిన యాక్షన్ చిత్రం “సరైనోడు” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. “సరైనోడు”లో ఆది పినిశెట్టి చేసిన విలన్ పాత్ర తనకి భలే నచ్చిందని, ఆ సినిమా వేరే భాషలో తీస్తే ఆ పాత్ర చేస్తానని ఈ సినిమా ఆడియో వేడుకలో బన్నీచెప్పాడు. విలన్ పాత్ర చేయడానికి తాను రెడీ అని డైరక్టర్లకు బహిరంగంగానే ఆఫర్ ఇచ్చాడు. స్టైలిస్ట్ స్టార్ గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ నిజంగా విలన్ పాత్ర చేస్తాడా? అని చాలా మంది సందేహించారు. వారి అనుమాలన్నీబన్నీ పటా పంచలు చేయనున్నాడు.
ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళం, తెలుగు భాషల్లో చిత్రాన్ని చేయడానికి అంగీకరించాడు. ఇందుకు లింగు స్వామీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. ఒకటి హీరో అయితే, రెండోది విలన్. రెండు పాత్రల్లో విభిన్నంగా కనిపించి, నటించడానికి అల్లు అర్జున్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఆడియో వేడుకలో చెప్పినట్లే బన్నీవిలన్ పాత్ర చేస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.