మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ‘సీతా రామం’ (Sita Ramam) అనే ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. అటు తర్వాత ‘హాయ్ నాన్న’ (Hi Nanna) అనే సినిమాలో కూడా నటించింది. అది కూడా హిట్టే. అయితే విజయ్ దేవరకొండకి (Vijay Devarakonda) జోడీగా చేసిన ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) నిరాశపరిచింది. ప్రభాస్ (Prabhas) ‘కల్కి 2898 AD’ లో (Kalki 2898 AD) చిన్న పాత్ర చేసినా ఈమెకు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. ఈ క్రమంలో తెలుగులో ఈమెకు అవకాశాలు తగ్గడం వల్ల బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ వస్తుంది అనే టాక్ ఉంది.
అయితే అందులో నిజం లేదు అని ఈమె మొన్నామధ్య ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చింది. ‘బాలీవుడ్లో కొంచెం ఎక్కువ సినిమాలు చేయడం వల్ల.. తెలుగులో కొంత గ్యాప్ ఇచ్చినట్లు తెలిపింది. ఇటీవల అడివి శేష్ (Adivi Sesh) ‘డెకాయిట్’ సినిమాలో ఈమె హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా అది పెద్ద ఆఫరే.
అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద ఛాన్స్ కొట్టినట్టు ఇన్సైడ్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ (Allu Arjun) సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందట. అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్నాడు. కాబట్టి ముగ్గురు హీరోయిన్లు నటించాల్సి ఉంటుందట. అందులో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. మరో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయినట్టు టాక్ గట్టిగానే వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.