“నా పేరు సూర్య” డిజాస్టర్ అనంతరం సినిమాల విషయంలోనే కాక కథల ఎంపిక విషయంలోనూ పలు జాగ్రత్తలు వహిస్తున్నాడు అల్లు అర్జున్. అందుకే తన తదుపరి చిత్రాన్ని ఇదివరకటిలా మాస్ మసాలా ఎంటర్ టైనర్ లా కాకుండా టిపికల్ పోలిటికల్ జోనర్ లో సెలక్ట్ చేసుకొన్నాడని టాక్ వినిపించింది. అయితే.. ఇప్పుడందుతున్న తాజా సమాచారం ప్రకారం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం పునర్జన్మల నేపధ్యంలో రూపొందనుందని విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ పునర్జన్మల నేపధ్యం కూడా రాజకీయం చుట్టూనే తిరుగుతుందని, ఈ సినిమాలో అల్లు అర్జున్ మంత్రిగా నటించనున్నాడని సమాచారం. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం నవంబర్ నుంచి మొదలవ్వానుండగా.. ఆల్రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యిందట. “హలో” అనంతరం విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుందా లేక బయటి సంస్థ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.