బన్నీ -త్రివిక్రమ్ చిత్రానికి ముహూర్తం ఫిక్స్..!

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసి దాదాపు మూడు నెలలు కావస్తున్నప్పటికీ.. ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇది అల్లు అర్జున్ కి 19వ చిత్రం కావడం విశేషం. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ చాలా కాలంగా ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఈ చిత్ర కథ పై త్రివిక్రమ్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు.ఈ ప్రాజెక్ట్ బన్నీ- త్రివిక్రమ్ లకి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో… ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందట.

మార్చి 27 న ఈ చిత్రం లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. ఆ రోజున చరణ్ పుట్టినరోజు కావడం కూడా విశేషం. ఇక ఆరోజునే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి వెళ్ళాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ప్లాన్ కలిగి ఉన్నాడట. ఈ బావా – బావమరుదులు అనుబంధం .. ఆత్మీయత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus