ఓ పక్క ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ అండ్ ఫ్యామిలీ కి ఊహించని షాక్ తగిలింది. బన్నీ మేనమామ అలాగే… తన 20 వ చిత్రాన్ని నిర్మిస్తున్న ముత్తంశెట్టి రాజేంద్రప్రసాద్ ఈ బుధవారం నాడు గుండెపోటుతో మరణించారు. దీంతో అల్లు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఈ వార్త తెలిసిన హుటాహుటిన ముత్తంశెట్టి రాజేంద్రప్రసాద్ సొంత ఊరు అయిన విజయవాడకు అల్లు కుటుంబ సభ్యులు తరలి వెళ్ళారు.
అల్లు అర్జున్ తల్లి నిర్మలా దేవికి… ముత్తంశెట్టి రాజేంద్రప్రసాద్ స్వయానా అన్నయ్య. నిజానికి అల్లు అర్జున్ కి తన మావయ్య అంటే చాలా ఇష్టం. బన్నీ సుకుమార్ తో చేయబోతున్న తన 20 వ చిత్రానికి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో సహ నిర్మాతగా వ్యవహరించడానికి ముత్తంశెట్టి రాజేంద్రప్రసాద్ రెడీ అయ్యారు. ఇలా అయన సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న టైంలో ఆయన మృతి చెందడంతో అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతున్నారు.
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!