అల్లు అర్జున్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ‘రామలక్ష్మీ సినీ క్రియేషన్స్’ బ్యానర్ పై లగడపాటి శిరీష,లగడపాటి శ్రీధర్,బన్నీ వాసు,కె. నాగేంద్రబాబు లు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2018 వ సంవత్సరం మే 4 న విడుదలైంది. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. తర్వాత బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నిలబడలేకపోయింది.
ఫుల్ రన్లో ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి. కథ బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కథనం లోపించడం, మ్యూజిక్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోవడంతో ఫలితం తేడా కొట్టింది. రచయితగా స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న వక్కంతం వంశీ.. దర్శకుడిగా చేసిన మొదటి చిత్రం సక్సెస్ అందించలేకపోయింది. రెండో సినిమాని నితిన్ తో చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఇంకా ఆ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ లేదు.
ఇదిలా ఉండగా.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రానికి హీరోగా ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ కాదట. ఈ విషయాన్ని దర్శకుడు వక్కంతం వంశీ ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘ ‘నా పేరు సూర్య’ ఎన్టీఆర్ చేయాల్సిన మూవీ. అతనే నన్ను డైరెక్టర్ ను చేస్తాను అన్నాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల అది అల్లు అర్జున్ కి వెళ్ళింది’ అంటూ చెప్పుకొచ్చాడు వంశీ.
నిజానికి ‘నా పేరు సూర్య’ కథని ఎన్టీఆర్ తో వంశీ చేయాలనుకున్న మాట నిజమే. కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నాడు. కానీ ఎందుకో వక్కంతం వంశీ ప్లేస్ లో బాబీ వచ్చి ‘జై లవ కుశ’ చేశాడు. ఇది యావరేజ్ గా నిలిచింది. ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ గా మిగిలింది. సో ఎన్టీఆర్ అలా ఓ ప్లాప్ నుండి బయటపడ్డాడన్న మాట.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!