Allu arjun: ఢీ కింగ్స్ వర్సెస్‌ క్వీన్స్‌లో ‘పుష్ప’రాజ్‌ సందడి!

టాలీవుడ్‌లో బెస్ట్‌ డ్యాన్సర్‌, పర్‌ఫెక్ట్‌ డ్యాన్సర్‌, హార్డ్‌కోర్‌ డ్యాన్సర్‌, మాస్‌ డ్యాన్సర్‌, స్టైలిష్‌ డ్యాన్సర్‌… ఇలా డ్యాన్స్‌కి సంబంధించిన బిరుదుకు అయినా సూట్‌ అయ్యే హీరోలు కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో ఒకడు అల్లు అర్జున్‌. 18 ఏళ్ల హీరో కెరీర్‌లో… ప్రాణం పెట్టి డ్యాన్స్‌ చేస్తున్నాడు. అందుకే ఐకాన్‌ స్టార్‌గా మారాడు. ఇప్పుడు ఆ ఐకాన్‌ స్టార్‌ తెలుగు బెస్ట్ డ్యాన్స్ షోస్‌లో ఒకటైన ఢీకి రాబోతున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న ‘ఢీ ’ కొత్త సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేకి వస్తున్నాడు.

అమ్మాయిలు, అబ్బాయిలను వేర్వేరు టీమ్‌లుగా చేసి ‘ఢీ’లో ‘కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ సీజన్‌ చివరిదశకు వచ్చింది. ఇటీవల సెమీ ఫైనల్స్‌ పూర్తయ్యాయి. నిజానికి ఫైనల్‌ షూటింగ్‌ కూడా పూర్తయిపోయిందట. ఢీ చరిత్రలోనే భారీ సెట్‌ వేసి మరీ ఈ ఫైనల్‌ను షూట్‌ చేశారట. ఎవరు గెలిచారు, ఏంటి అనే విషయంలో సోషల్‌ మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. అయితే దీనికి అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా వచ్చాడు అనేది తాజా విషయం. ఈ మేరకు ఓ ప్రోమో విడుదలైంది.

‘ఢీ’కి అల్లు అర్జున్‌ గతంలో ఒకసారి వచ్చాడు. పదేళ్ల క్రితం ‘ఢీ 3’ ఫైనల్‌కు చీఫ్‌ గెస్ట్‌గా విచ్చేశాడు బన్నీ. అప్పుడు అల్లు అర్జున్‌తో దర్శకుడు సుకుమార్‌ కూడా వచ్చారు. ఇప్పుడు బన్నీ సింగిల్‌గానే వచ్చినట్లు తెలుస్తోంది. ఎంట్రీని భారీ గ్రూప్‌తో ‘పుష్ప’ పాటతో ఇచ్చాడు. డిసెంబరు 1న ఫైనల్‌ తొలి ఎపిసోడ్‌ ప్రారంభమవుతుంది. ఆ ఎపిసోడ్‌ ఆఖరులో కానీ, డిసెంబరు 8న ప్రసారమయ్యే ఫైనల్‌ ఆఖరి ఎపిసోడ్‌ మొదట్లో కానీ బన్నీ ఎంట్రీ ఇస్తాడట.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus